Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Trade Talk - Agnyaathavaasi to Touch Chesi Choodu

ట్రేడ్ టాక్ : ‘అజ్ఞాతవాసి’లను టచ్ చేసి చూడటం లేదు

"నీకు నీ కుటుంబం క్షేమంగా కావాలంటే ...మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో అప్పచెప్పు"... అని విలన్ ..క్రూరంగా హీరో ఫ్రెండ్ ని చూస్తూ అంటాడు. ఆ ఫ్రెండ్ ఫ్యామిలీ అప్పటికే అక్కడ కట్టేసి ఉంటుంది. విలన్ అనుచరులు వాళ్లకు తుపాకులు గురి పెట్టి ఉంటారు. ఆ ఫ్రెండ్ కొడుకు..నాన్నా..నాన్నా అని ఏడుస్తూంటాడు... ఓ పెద్ద డైలమో..ఏం చేయాలో అర్దం కానీ సిట్యువేషన్ ....అటు చూస్తే ఫ్రెండ్..ఇటు చూస్తే..తన సొంత కుటుంబం...ఏం చేయాలి...ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి...అలాంటి సిట్యువేషన్ లో ఏం నిర్ణయం తీసుకుంటాడో..అందరికీ తెలుసు... అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే...తెలుగు సినిమా పరిస్దితి..ఈ సంవత్సరం మొదటి నుంచి అలాగే ఉంది.

అన్ని సినిమాలు ఆడాలి..అందరూ చల్లగా ఉండాలి...అని సినిమా వాళ్లంతా ఎప్పుడూ స్టేజ్ ల మీద ప్రతిజ్ఞ చేసి మరీ చెప్తూంటారు. కానీ చిత్రంగా ప్రక్క సినిమా టాక్ మీద మన సినిమా సక్సెస్ ఆధారపడితే..ఏం చేస్తారు... ఏం చేయాలి..ఇదే వింత పరిస్దితి టాలీవుడ్ లో ఏర్పడింది. అలాగని ప్రక్క సినిమా పోవాలని అందరూ పూజలు వ్రతాలు మొదలెట్టారని చెప్పటం లేదు. మరేం చేస్తున్నారు. ఏమిటా పరిస్దితి.

Agnyaathavasi Poster

కొత్త సంవత్సరం వచ్చింది...కోటి ఆశలు తెచ్చింది అందరికీ...అందరితో పాటే సినిమా వాళ్లకీనూ...ఈ సంవత్సరం వరసపెట్టి హిట్ సినిమాలే వస్తాయని అంతా ఆశించారు. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద ఉత్సవమే జరుగుతుందనుకున్నారు. కానీ జరిగిందేమిటి...ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ విజయం నమోదు చెయ్యలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఆనవాలు లేకుండా రిలీజైన రెండో రోజు నుంచే థియోటర్స్ ఖాళీ చేయటం చూసి సగటు ప్రేక్షకుడు షాక్ అయ్యాడు. అలాగే అదే సంక్రాంతికి అన్నపూర్ణ బ్యానర్ లో ...రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘రంగుల రాట్నం’ సైతం ఫ్లాఫ్ పాలైంది. దాంతో బాలయ్య హీరోగా వచ్చిన ‘జై సింహా’కూడా అంతంతమాత్రంగానే ఉన్నా...ఏదో ఒకటి సంక్రాంతికి అని చూసి పాస్ చేసారు ప్రేక్షకులు. ఏ మాత్రం ‘అజ్ఞాతవాసి’ ఆడినా ...‘జై సింహా’ కు ఆ స్దాయి కలెక్షన్స్ రావనేది నిర్వదాంశం. అంటే ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ ...‘జై సింహా’ కు కలిసి వచ్చింది. కావాలని ప్లాన్ చేసింది కాదు...అలా కలిసి వచ్చిందంతే..ఇక డబ్బింగ్ సినిమాగా వచ్చిన సూర్య గ్యాంగ్ సినిమా ..సంక్రాంతికు మంచి టాక్ తెచ్చుకున్నా..దాన్ని ప్రమోట్ చేసే వాళ్లే కరువయ్యారు..అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్లే తెలియలేదు. దాంతో ఆ సినిమాకు జనం కరువు అయ్యారు.

Bhaagamathie Poster

సర్లే సంక్రాంతి వెళ్లిపోయింది...సరైన సినిమాలు లేక టీవి షోలతో సరిపెట్టుకున్న జనం..ఆ తర్వాత వచ్చిన పెద్ద సినిమాలు కాస్తంత ఊరట ఇస్తాయేమో అని ఆశపడ్డారు. అనుష్క ‘భాగమతి’ అద్బుతం కాకపోయినా, యావరేజ్ టాక్ వచ్చినా ఏ సినిమాలు మార్కెట్ లో లేకపోవటం పూర్తిగా కలిసి వచ్చింది. ఓకే అనుకున్న సినిమాని సైతం ఓ వండర్ లా చూసి జనం కళ్లకు అద్దుకున్నారు. కలెక్షన్స్ కురిపించారు.

Touch Chesi Choodu Poster

ఆ తర్వాత మళ్లీ భాక్సాఫీస్ మీద ఆశలు రేపుతూ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ వచ్చింది. అదే రోజు ...నాగ శౌర్య ‘ఛలో’సైతం రంగంలోకి దిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ‘టచ్ చేసి చూడు’ మరో ‘అజ్ఞాతవాసి’ అయ్యిపోయింది. దాంతో ప్రక్కనే కామెడీ సినిమాగా యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘ఛలో’ కు అది ప్లస్ అయ్యింది. రవితేజ సినిమాకు ప్లాన్ చేసుకున్న జనం మొత్తం ‘ఛలో’కు షిప్ట్ అయ్యిపోయారు. ఇలా ప్రక్క సినిమా ఫెయిలైతేనే మన సినిమా హిట్ అయ్యే కొత్త భాక్సాఫీస్ ఫార్ములా బయిలుదేరిందా అనే డౌట్ వచ్చే పరిస్దితి వచ్చింది. ఏదైమైనా సినిమా తన సత్తా తోనే ఆడాలి..ప్రక్క సినిమా పరాజయం మీద ఆధారబడి బ్రతకకూడదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఫెయిలైతే వాటి ప్రభావం ట్రేడ్ మీద చాలా దారుణంగా ఉంటుంది.

కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నాశనమైపోతారు. థియోటర్స్ లో జనం లేక..కొన్నాళ్లకు షాపింగ్ కాంప్లెక్స్ లుగా మారిపోతాయి. ఫ్లాఫ్ సినిమాల శాటిలైట్ రైట్స్ ..రిలీజ్ కు ముందు కోట్లు పోసి తీసుకున్న టీవి ఛానెల్స్ వాళ్లూ ఆ సినిమాలకు టీఆర్పీలు లేక నష్టపోతారు. నిర్మాత సైతం ఆ తర్వాత సెటిల్ మెంట్ లతో దిగాలుపడిపోతారు. ఒక్క తుఫాన్ దెబ్బకు రాష్ట్రం అల్లకల్లోలం అయినట్లుగా... ఒక్క పెద్ద సినిమా డిజాస్టర్ దెబ్బకు ఎంతోమంది... ఆదుకోలేని సిట్యువేషన్ లోకు వెళ్లిపోతారు. అందుకోసం ఏం చేయాలి...హిట్ సినిమా తీయాలి అంతే...అది అత్తారింటికి తీసిన త్రివిక్రమ్ కు తెలుసు...ఎన్నో సక్సెస్ లు కెరీర్ లో వేసుకున్న రవితేజకు కు తెలుసు.. కాకపోతే కొన్ని సార్లు లెక్కలు తప్పుతాయంతే. వాటిని సరిచేసుకోవాలి. లేకుంటే వాటిని ఎవరూ టచ్ చేయరు. జనాలు అజ్ఞాత వాసం లో ఉండిపోతారు.