Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Trade Talk - Inttelligent to Tholi Prema

ట్రేడ్ టాక్ : వెంకీ వీక్స్..మీ ఇద్దరే పీక్స్

ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కాక, తెలుగు సినిమా అభిమానుల్లోనే ఇద్దరు వెంకీల గురించే చర్చ. వెంకీ అంటే హీరో వెంకటేష్ కాదు. తమ సినిమాలతో వారం తేడాలో దర్శకులుగా తెలుగుతెరకు పరిచయమైన వెంకీ అట్లూరి, ఛలో తో వెంకీ కుడుమల. వీళ్లు ఫ్రెష్ ధాట్స్ తో, ఒరిజనల్ ఐడియాలతో సీరియర్స్ కు పోటీ ఇచ్చి తమ సినిమాలను నిలబెట్టుకున్నారు.

Chalo Poster

పూర్తి వివరాల్లోకి వెళితే... ఒక్క సినిమా వచ్చి హిట్ అయ్యిందీ అంటే దాని అదృష్టం ఏంటోగానీ ఆ తర్వాత వచ్చే చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నీరుగారిపోతున్న విచిత్రం చిత్ర పరిశ్రమలో కొద్ది వారాలుగా కనిపిస్తోంది. ఈవారమూ అదే విషయం స్పష్టమైంది. ఈ వారం ఇంటిలిజెంట్, గాయిత్రి, తొలిప్రేమ విడుదలయ్యాయి.

సాయి ధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇంటిలిజెంట్' చిత్రం రిలీజ్ రోజు మార్నిగ్ షో నుంచే పూర్తి నెగెటివ్ టాక్‌తో డీలా పడిపోయింది. కథ బాగోలేదని, వినాయిక్ మేకింగ్ సైతం చాలా అనాసక్తంగా సాగిందని, పరమ బోర్ అని ఇనానమస్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇది. అజ్ఞాతవాశి తర్వాత ఆ రేంజి డిజాస్టర్ ఇది.

మోహన్ బాబు మూవీ ‘గాయిత్రి' విషయానికి వస్తే.... సినిమా ఫర్వాలేదనే టాక్ తెచ్చుకున్నా,రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా ఫలితం కనపడటం లేదు. సినిమాలో మోహన్ బాబు అద్బుతంగా నటించాడు,విశ్వరూపం చూపించారన్నా జనం అటు వైపు వెళ్లటం లేదు. మోహన్ బాబుతో ఆయన కుమారుడు కాకుండా వేరే వారు నటించి ఉంటే ప్రాజెక్టు కు క్రేజ్ వచ్చి...ఈ టాక్ కలిసివచ్చేదంటున్నారు. మరీ ముఖ్యంగా గ్యాప్ తీసుకుని చాలా కాలం తర్వాత ఈ సినిమా డైరక్ట్ చేసిన పెళ్లైన కొత్తలో మదన్ కు ఇది నిరాశకలిగించే పరిణామమే. అయితే అది ఆయన తప్పేనని, డైలాగులు, కథ బాగున్నా...మోహన్ బాబు ..విలన్ గా అద్బుతంగా నటించాడన్నా ...సినిమా మేకింగ్ సరిగా లేకపోవటంతో జనాలని దూరం పెట్టింది.

Tholi Prema Poster

ఇక మిగిలించి వరుణ్ తేజ ‘తొలి ప్రేమ' . ఈ చిత్రం పై రెండు చిత్రాలకి రివర్స్ లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ వారం తిరుగు లేకుండా భాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతోంది. మరీ ముఖ్యంగా ఓవర్ సీస్, మల్టీ ఫ్లెక్స్ లలో సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. ఈ మధ్యనే సుమంత్ తో చేసిన మళ్లీ రావా తో పోలిక ఉందన్నా...సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదు. ఈ చిత్రంతో పరిచయమైన వెంకీ అట్లూరి కు ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే క్లాస్ సినిమాగా ముద్ర పడటంతో బి,సి సెంటర్లలలో ఈ సినిమాకు అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ లేవు. అయితే ఈవారం ఈ చిత్రంతోనే కొద్దోగొప్పో బాక్సాఫీసు కళకళలాడుతోంది.

ఇదిలా ఉంటే... పండుగ వినోదాన్ని అందించే లక్ష్యంతో విడుదలైన సంక్రాంతి సినిమాలు అన్ని వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లి పోవటంతో...అందరూ ఆ తర్వాత వచ్చే సినిమాలపై ఆశపెట్టుకున్నారు. రవితేజ హీరోగా వచ్చిన టచ్ చేసి చూడు భయపెట్టినా... భాగమతి భాక్సాఫీస్ ని బ్రతికించింది. అలాగే చిన్న సినిమాగా విడుదలై, పెద్ద సినిమాగా మారురిందినాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమా. ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. కొన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది. ఈ సినిమాతో వెంకీ కుడుమల అనే కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు. మొత్తానికి తొలి ప్రేమతో ..వెంకీ అట్లూరి, ఛలో తో వెంకీ కుడుమల దర్శకుడు పరిచయమై హిట్ కొట్టడం విశేషం.