Movies | Music | Masti Close Aha Ad
Watch Latest Movies & Web Series on AHA!
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Rogue Movie Review

March 31, 2017
Tanvi Films
Ishaan, Mannara Chopra, Angela Krislizki, Thakur Anoop Singh, Ajaz Khan, Avinash, Ali, Thulasi Shivamani and Subbaraju
Mukesh G
Junaid Siddique
Johnny Shaik
Jayaditya
Sunil Kashyap
Dr. CR Mohan and CR Gopi
Puri Jagannadh

పూరి మార్క్ పూర్ లవ్ స్టోరీ ( 'రోగ్' రివ్యూ )

డైరక్టర్ పూరి జగన్నాథ్ ప్రారంభం రోజుల్లో అందించిన ... ‘ఇడియట్ ’...ఓ చంటిగాడి ప్రేమ కథ.. ఓ సంచలనం. అందులో హీరో క్యారక్టరైజేషన్, డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయి అంటే..రీసెంట్ గా నాని సూపర్ హిట్ కు ..సైతం 'నేను లోకల్' అని టైటిల్ పెట్టేటంత. వేరే వాళ్లే మన 'ఇడియట్' ని గుర్తు చేసి హిట్స్ కొడుతున్నారే...వరస ఫ్లాఫుల్లో ఉన్న మనం మాత్రం ఎందుకు వెనక్కి తగ్గాలి..మనమూ మరో చంటి గాడి ప్రేమ కథ అంటే చూడ్డానికి ఎగబడరూ అని ఆలోచన చేసినట్లున్నారు పూరి.

అయితే ఆయన తాజా స్కీమ్ అంతగా ఫలించినట్లు కనపడలేదని ఈ సినిమాకు వచ్చిన పూర్ ఓపినింగ్స్ సాక్ష్యంగా నిలబడ్డాయి. అప్పటికీ ధైర్యం చేసి థియోటర్స్ కి దూకేసిన వాళ్లకు...పూర్ స్టోరీతో కొత్త కుర్రాడి ని పరిచయం చేసి, అతని చేత పైత్యం డైలాగులు కొన్ని చెప్పించి, అదే కొత్తదనం అనుకోమని తన తదుపరి ప్రాజెక్టులో బిజీ అయ్యిపోయారు పూరి. దాంతో 'రోగ్' చూడటానికి వెళ్లకుండా జాగ్రత్తపడినవాళ్లంతా..వెళ్లినవాళ్లను చూసి..వీళ్లకు భలే రోగం కుదిరిందే అనుకునే పరిస్దితి వచ్చేసింది. సరి సరే...ఇంతకీ అసలు ఈ సారి పూరి చెప్పిన ఆ పూర్ స్టోరీ ఏంటి..తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నారా...అయితే చదవేయండి...మరి

అప్పటి 'ఇడియట్' ని గుర్తు చేస్తూ...ఇప్పటి ఈ కొత్త చంటి(ఇషాన్ ) కమీషనర్ కుమార్తె అంజలి (ఏంజెలా)ని ప్రేమిస్తాడు. ఆమే లైఫ్ అనుకుని రోజూ ఆమెతో ప్రేమ సముద్రంలో మునిగితేలుతూంటాడు. అయితే అతని ప్రేమకు ఓ రోజు సునామి స్దాయిలో దెబ్బ తగులుతుంది. అదేమిటంటే..అంజలి... తన ఇంట్లో వాళ్లు చూసిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ (సుబ్బరాజు)ను పెళ్లి చేసుకోవటానికి ఓకే చెప్పేస్తుంది. దాంతో మనవాడు రెచ్చిపోయి.. ఆ వివాహ నిశ్చితార్దాన్ని ఆపటానికి వెళ్తాడు. తనని చుట్టు ముట్టిన పోలీసులతో పెద్ద ఫైట్ చేసేస్తాడు. ఆ గొడవలో ఓ కానిస్టేబుల్ (సత్యదేవ్) కాళ్లు రెండు విరగ్గొట్టేస్తాడు. పోలీసులతో పెట్టుకున్నందుకు మనోడికి రెండేళ్లు జైలు శిక్ష పడుతుంది.

జైలు నుంచి బయిటకు వచ్చిన చంటికి ...తన వల్ల కాళ్లు పోగొట్టుకున్న కానిస్టేబుల్ కుటుంబం కష్టాలు పడుతున్న విషయం తెలుసుకుంటాడు. మనోడు గిల్ట్ ఫీలయ్యి...వాళ్లింటికి వెళ్లి..వాళ్లు ఏక్సెప్టు చేయకపోయినా..తను ఆటో నడిపి మరీ సంపాదించేసి, రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ...వాళ్ల అప్పులు తీర్చేస్తాడు. అంతేకాకుండా... అమ్మాయిలంటేనే అసహ్యం పెంచుకుని అవసరం ఉన్నా లేకపోయినా ..వరసపెట్టి డైలాగులు చెప్తూ తిరుగుతూంటారు.

సరే..వేర్ ఈద లవ్ స్టోరీ ...హీరోయిన్ ఎక్కడ...ఆమె కు మొదట్లోనే పెళ్లై పోయింది కదా ..పూరి మరీ అడ్వాన్స్ అయ్యిపోయి..పెళ్లైన ఆమెతో లవ్ వ్యవహారం నడిపించేసాడా ఏమిటి అని మీరు డౌట్ వచ్చింది కదా..అక్కడికే వస్తున్నాం. పూరి అంత ధైర్యం చేయలేదు లెండి. తను సాయిం చేస్తున్న కానిస్టేబుల్ కు ఓ చెల్లెలు అంజలి(మన్నారా) ఉంది. ఆమె అసలు హీరోయిన్. ఆమె సీన్ లోకి వస్తుంది. అక్కడ నుంచి ఆమె..తన కుటుంబానికి సాయిం చేస్తున్న మనోడితో ప్రేమతో పడుతుంది. మరి ..అమ్మాయిలు అంటే అసహ్యించుకునే మన హీరోగారు ఆమె ప్రేమను ఏక్సెప్టు చేస్తాడా.. ఆమెపై కన్నేసిన సైకో(అనూప్ సింగ్ ) పరిస్దితి ఏంటి ... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాతో పూరి ...ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేసాడు. అతనికి ఫైట్స్ వచ్చు అని చెప్పటానికి సీన్స్ అనుకుని, అందుకు తగ్గట్లు కథ రెడీ చేసినట్లు అనిపిస్తుంది. కుర్రాడుకు ఆ స్కిల్స్ బాగానే చూపించాడు. అయితే ఆ కుర్రాడికి ఇచ్చిన క్యారక్టరైజన్ మాత్రం కొత్త కుర్రాడికి చెయ్యాల్సింది మాత్రం కాదు. క్యారక్టర్ ఇమేజ్ ని అతను మెయ్యలేకపోయాడు. పూరి దృష్టి మాత్రం ఎంతసేపూ హీరోకు బిల్డప్ షాట్స్ ఎస్టాబ్లిష్ చేయటంలోనే సరిపోయింది.

ఇక కథ విషయానికి వస్తే... జైల్లో ఉన్న చంటి తన ప్రేమకథను చెప్పడంతో ఇంట్రస్టింగ్ గా సినిమా ఆరంభించిన పూరి ఇంటర్వెల్ దాకా గాలిని పోగుచేసినట్లు సీన్స్ అల్లేసాడు. ఇంటర్వెల్ తర్వాత అయినా సినిమా వేగం పుంజుకుంటుంది అంటే...సెకండాఫ్ చూసాక ..ఫస్టాఫే బాగుందనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర సైకో పాత్రను ప్రవేశ పెట్టిన పూరి ...సెకండాఫ్ లో రోగ్ (హీరో) కు సైకో మధ్య వచ్చే కాంప్లిక్ట్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. సైకో ని .. హీరో పట్టుకోవాలనుకున్నా లేక, సైకోని మట్టుపెట్టాలనే లక్ష్యం హీరోకు ఉన్నా సెకండాఫ్ రన్ పరుగెట్టేది. అలాంటిదేమీ లేకపోవటంతో హీరోకు లక్ష్యం అనేది లేక.. సెకండాఫ్ లో హీరోకు పనేమి లేక ఖాళీగా ఏం చెయ్యాలో అర్దం కాక, అప్పుడప్పుడూ ఫైట్స్, పాటలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తాడు. ఎంత మనం కాలక్షేపానికి సినిమాకు వెళ్తే మాత్రం...హీరో ఏ పని చెయ్యకుండా కాలక్షేపం చేస్తూంటే ఎలా భరిస్తాం చెప్పండి.

అలాగే పూరి సినిమాల్లో కామెడీ బాగుంటుంది. అయితే ఈ సారి అదీ ఫెయిలైంది. పోకిరిలో సూపర్ హిట్టైన ముష్టి మాఫియాని గుర్తు చేసేలా మళ్లీ అలీ చేత ముష్టోడు పాత్ర, ముష్టి గోల పెట్టాడు. బెగ్గింగ్ సిస్టమ్ ను మార్చాలనే పాత్రలో అలీ కనిపిస్తాడు. కానీ ఆ సీన్స్ అన్ని ముష్టిలాగే ఉన్నాయి. అలాగే పోసాని, సుబ్బరాజు , అనూప్ సింగ్ వంటి ఆర్టిస్ట్ లు రొటీన్ గా చేసుకుంటూ పోయారు.

ప్లస్ ల విషయానికి వస్తే... టెక్నికల్ గా ఈ సినిమా ఉన్నత స్దాయిలో ఉంది. ముఖ్యంగా చాలా స్టైలిష్ గా సినిమా ముస్తాబు చేసారు. నీళ్ళలో త డిస్తే పంది పిల్ల కూడా అందంగానే క న ప డుతుంది... వంటి పూరి డైలాగులు అక్కడక్కడా బాగా పేలాయి. హీరోగా కొత్త కుర్రాడైనా బాగా చేసాడు. మంచి కథ పడితే మంచి భవిష్యత్ ఉంటుందనిపిస్తోంది.

మైనస్ ల విషయానికి వస్తే...ఎప్పటిలాగే పూరి బాగా రొటీన్ కథ, కథనంతో ఈ సినిమా చేసారు. చాలా ప్రెడిక్టబుల్ గా సినిమా నడుస్తుంది. అలాగే పూరి గత చిత్రాల స్దాయిలో పాటలు లేవు.

ఫైనల్ గా... పూరి మార్క్ పూర్ స్టోరీతో వచ్చిన ఈ చిత్రం ఏ యాంగిల్ లోనూ మనను సంతృప్తి పరచదు(పూరి భాషలో చెప్పాలంటే).

నటీనటులు: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్ సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, సత్యదేవ్, సుబ్బరాజ్, రాహుల్ సింగ్, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు. ఛాయాగ్రహణం: ముఖేష్, సంగీతం: సునీల్ కశ్యప్, కూర్పు: జునైద్, నిర్మాతలు: సి.ఆర్.మనోహర్.. సి.ఆర్.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్ .