Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Jaya Janaki Nayaka Review

August 11, 2017
Dwaraka Creations
Bellamkonda Sai Srinivas, Rakul Preet Singh and Catherine Tresa
Boyapati Srinu
M Rathnam
Rishi Punjabi
Sahi Suresh
Kotagiri Venkateshwara Rao
Ram Lakshman
Vamsi Shekar
Jeevan.
Devi Sri Prasad
Miriyala Ravinder Reddy
Boyapati Srinu

బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక' రివ్యూ

జై బి,సి సెంటర్ల నాయక ('జయ జానకి నాయక' రివ్యూ )

బోయపాటి సినిమా అంటే ఓ స్టాండర్డ్ ఫార్మలా...అలాగే ఆయనపాత్రలది ఓ సెపరేట్ 'లా'. హీరో మారచ్చు, హీరోయిన్ మారచ్చు, విలన్ మారచ్చు కానీ బోయపాటి కథ,కథనం, పాత్రలు మారవు..వాటి పద్దతులూ మార్చుకోవు. ఆ పాత్రలు బయిట ప్రపంచంతో సంభందం లేకుండా బోయపాటి స్కూల్ ను అనుసరించి మాట్లాడుతూ , యాక్షన్ లోకి దిగి భీబత్సం సృస్టిస్తూంటాయి.

ఫర్ సపోజ్ బోయపాటి సినిమాలపై ఓ క్విజ్ కనుక పెడితే... పర్మనెంట్ సమాధానాలుఇవే.. బోయపాటి సినిమాలో సాధారణంగా హీరో ఏం చేస్తూంటాడు...సినిమా స్టార్టవకముందు కండలు పెంచే పనిలో బిజీగా ఉంటాడు. ఆ తర్వాత సినిమాలో పనిపాటు లేకుండా..వేరే ఏ వ్యాపకం పెట్టుకోకుండా ఇరవై నాలుగు గంటలూ... హీరోయిన్ నికి బాడీగార్డ్ లా మారిపోయి ఆమెను విలన్స్ నుంచి రక్షిస్తూ... ఫైట్స్ చేస్తూ బిజీగా ఉంటూంటాడు.

విలన్స్ ఏం చేస్తూంటారు. తమ జీవితాలని, వ్యాపారాలని అన్నిటినీ ప్రక్కన పెట్టి హీరోయిన్ కు అపకారం తలపెట్టి, ఆమె కోసం తిరుగుతూ, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ... హీరో చేతిలో తన్నులు తింటూంటారు....క్లైమాక్స్ లో చచ్చిపోతూంటారు. హీరోయిన్ ఏం చేస్తూ ఉంటుంది...హీరో తనను రక్షించేందుకు సరబడ సెంటిమెంట్ ని పండిస్తూ..అప్పుడప్పుడూ ఏడుస్తూంటుంది. మిగతా పాత్రలన్ని ఏం చేస్తూంటాయి. ఈ మెయిన్ పాత్రలు తమ సీన్స్ ని సమర్దవంతంగా పండించటానికి, అప్పుడప్పుడూ పొగడటానికి, సాయిం చేస్తూంటాయి.

అలా తనకంటూ ఓ మార్గం,మార్క్ వేసుకున్న బోయపాటి స్పార్క్ ఈ సారి జయజానకి నాయక అంటూ వచ్చింది. హిట్ అంటే ఎవరగని బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ని భుజాన వేసుకుంది. మరి ఈ సారి కూడా అదే తన రెగ్యులర్ ఫార్ములాను బోయపాటి ఫాలో అయ్యారా... బెల్లంకొండకు హిట్ అందించారా...కథని ఏమన్నా మార్చారా వంటి ప్రశ్నలకు సమాదానాలు కోసం రివ్యూలోకి వెళదాం.

కథేంటి

అమాయకత్వం కాకపోతే బోయపాటి సినిమాకు కొత్తగా కథేంటి? సర్లైండి ఆ ఉన్నదే చెప్పుకుంటే... గగన్‌(బెల్లంకొండ శ్రీనివాస్‌)ది స్త్రీ పాత్రలు లేని ప్రేమాలయం టైప్ ఫ్యామిలీ. ఆ ప్రేమాలయంలో ఓ ప్రక్కన కోట్లు సంపాదిస్తూ..ఇంట్లో.. మందులోకి సోడా కూడా కలిపి కొడుకు నోటికి అందించే అతి ప్రేమ ఉన్న తండ్రి చక్రవర్తి (శరత్‌కుమార్‌) , ఆ మందులోకి మంచింగ్ గా ఆమ్లెట్ వేసిపెట్టే అన్నయ్య(నందు) ఉంటారు. అలాంటి ముచ్చటైన ఫ్యామిలీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. అందుకే మన హీరోకు కూడా వాళ్లంటే ప్రాణం.

ఇక.. కాలేజీకు వెళ్లే గగన్‌ ఓ ర్యాగింగ్ టైప్ సీన్ లో ఫైట్ చేస్తే .. స్వీటీ(రకుల్‌ప్రీత్‌సింగ్‌) పరిచయం అవుతుంది. ఆమె అచ్చ తెలుగు హీరోయిన్ టైప్. హీరో ఫైట్ చూసి అమాంతం ప్రేమలో పడిపోతుంది.. ఆ తర్వాత అతన్ని మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాక హీరో ఇంటికి వెళ్లిన మొదటి రోజే...ఆ ఇంట్లో మందుగ్లాసులు తీసేసి, ఇల్లు సర్దేసి ఇల్లు స్వరూపం మార్చేసి మరింత గొప్ప ప్రేమాలయం గా చేసేస్తుంది. ఆమెతో మొదట్లో మన గగన్ బాబు అంటీ ముట్టనట్లు ఉన్నా తర్వాత సర్లే రకుల్ ప్రీతిలాంటి అందగత్తె, అదీకాక ఆమే వెంటబడుతోంది..ఇవన్నీ కాక మనింట్లో వాళ్లుకూడా ఆమె వైపే మొగ్గుచూపుతున్నాడు అనికుని ...ఓకే అనేసాడు. అక్కడనుంచి ఇద్దరూ ఓ డ్యూయిట్ వేసుకుంటారు.

అలా హీరో జీవితంలో లవ్ ఎపిసోడ్ పూర్తి చేసిన డైరక్టర్... నెక్ట్స్ స్టెప్ అయిన యాక్షన్ ఎపిసోడ్స్ పై కాన్సర్టేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతే విలన్స్ రంగంలోకి దిగారు... కథలో ఓ భీకరమైన మలుపు. ఆ టర్న్ అటు తిరిగి ఇటు తిరిగి హీరోయిన్ పీకకు చుట్టుకుంది. అక్కడనుంచి ఆమె జీవితం నరకమైపోయింది. ఆమెను చంపేయాలని విలన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆమె సీన్స్ అన్నీ ఏడుపులు ,సెంటిమెంట్ కు షిప్ట్ అయిపోయాయి. అది చూసి హీరో తట్టుకోలేకపోతాడు...తన స్వీటికు వచ్చిన సమస్యలను పరిష్కరించటానికి యాక్షన్ లోకి దిగుతాడు. అక్కడ నుంచి విలన్స్ కూడా ఇన్నాళ్లకు తమకోపని దొరికిందన్నట్లుగా భీబత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేసేస్తూంటారు. ఫైనల్ గా హీరో గెలుస్తాడా..విలన్స్ ఛస్తారా తెరమీద చూడండి అనను కానీ...విలన్స్ కు హీరోయిన్ తో ఎలా తగువు మొదలైంది. హీరోయిన్ కు అశ్వింత్‌ నారాయణ (జగపతిబాబు)కీ, ఉన్న సంబంధం ఏమిటి?, ప్రగ్యా జైస్వాల్‌, వాణి విశ్వనాధ్ పాత్రలు ఏమిటి ... తదితర విషయాలు తెరమీద చూడండి.

స్క్రీన్ ప్లే కాదు యాక్షన్ ప్లే

ఈ సినిమా రెగ్యులర్,రొటీన్ బోయపాటి సినిమా. సరైనోడు మళ్లీ చూస్తున్నట్లు అనిపించే ఈ సినిమాకు ప్రత్యేకంగా ఎనాలసిస్ చేసేటంత కథేమి లేదు. ఎనాలసిస్ చేయాల్సి వస్తే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ పై చేయాలి. ఫలానా సీన్ లో హీరో ఎలా కండలు చూపించాడు. మరో సీన్ లో ఒంటి చేత్తే అంత మందిని ఎలా చావకొట్టాడు. వేరే సీన్ లో విలన్ తల ఎలా తెగనరికాడు వంటివి చర్చించుకోవాలి.

క్రైమ్ ని,సెక్స్ ని నమ్ముకున్న సినిమాలు ఫ్లాఫ్ కావు అని హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్స్ చెప్తూంటారు. ఆ మాటలు బోయపాటి విన్నాడో లేక తన అనుభవంలో తెలుసుకున్నాడో కానీ ఆ రెండింటికి సెంటిమెంట్ అనే ఎమోషన్ ని కలిపి తొలిసినిమా నుంచి వడ్డించేస్తున్నాడు. క్రైమ్ ని వయలెన్స్ గా , సెక్స్ ని నాటు శృంగారం గా తనదైన శైలిలో మార్చి హిట్ కొట్టేస్తున్నాడు. ఈ సారి అదే రూటులో వెళ్లాడు. ఇంట్రవెల్ వద్ద ఓబ్యాంగ్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ మలుపు గట్రా ఏమీలేవు.

హాంకాంగ్ సినిమాలాగ...

ఈ సినిమా చూస్తూంటే...ధాయిలాండ్, హాంకాంగ్ యాక్షన్ సినిమాలు గుర్తు వస్తాయి. అంటే మొదటి సీన్ నుంచి చివరి సీన్ దాకా ఏదో వంకతో హీరో,విలన్ కొట్టేసుకునే సినిమాలు అవి. ఓ వర్గం నుంచి విపరీతమైన ఆదరణ ఉంటాయి ఆ సినిమాలకు. ఈ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. సాధారణంగా కథ,కథనం అనుకుని యాక్షన్ సీన్స్ రాసుకుంటారు..కానీ ఈ సినిమా చూస్తూంటే...మొదట యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుని, వాటి చుట్టూ కథ రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఏదైతేనేం ఇది ఓ యాక్షన్ సినిమా అంతే.

ఎవరెలా చేసారు...

హీరో నుంచి క్యారక్టర్ ఆరిస్ట్ కు షిప్ట్ అయిన నందుకు ఈ సినిమా బాగా ప్లస్ అవుతుంది. అతనిలోని స్పార్క్ ని ఈ సినిమా బయిటకు తీసింది. బోయపాటి శ్రీను అయితే కేవలం కండలు చూపిస్తే సినిమా నడిచిపోతుందన్నట్లుగా ఉన్నాడు తప్ప...సీన్ కు తగ్గ ఎమోషన్స్ ని తన ఫేస్ లో పలకించలేకపోయాడు. జగపతిబాబు...క్యారక్టర్ పరువు కోసం కూతురని సైతం చంపుకోవటం వంటి సీన్స్ తో కొత్తగా బాగుంది. శరత్ కుమార్..హీరో కు కండల విషయంలో పోటీ ఇచ్చాడు. విలన్ ..సోసోగా ఉన్నాడు. రకుల్ ప్రీతి సింగ్..ఉషారుగా ఉన్నంతసేపూ బాగుంది. ఆ తర్వాత ..,సెకండాఫ్ మొత్తం డల్ గా ..ఏడుస్తూ...విరక్తి పుట్టించేసింది. .. ప్రగ్యా జైస్వాల్‌ కు చెప్పుకోదగ్గ క్యారక్టరే లేదు..ఓ సాంగ్ తప్ప. కాబట్టి ఆమె గురించి మాట్లాడుకునేదేమీ లేదు. కేథరిన్ అయితే మరీ దారుణం... ఐటం సాంగ్ కే పరిమితం.

టెక్నికల్ గా...

ఈ సినిమాకు పని చేసిన టెక్నికల్ టీమ్ అంతా హై స్టాండర్డ్స్ ఉన్నవాళ్లే. విజుల్స్ మొత్తం చాలా రిచ్ గా గ్రాండియర్ గా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రిషీ పంజాబీ కెమెరా వర్క్ సూపర్బ్. దర్శకుడుగా బోయపాటి శ్రీను తనదైన మార్కు డోస్ బాగా పెంచేసాడు. అయితే కాస్తంత రొటీన్ కథ వదిలి, కొత్త కథ,కథనం పై దృష్టి పెడితే ఇలాంటి మంచి మేకర్ ..సినీ చరిత్రలో నిలిచి పోయే బాహుబలి తరహా సినిమాలు చేయగలుగుతాడు.

ఫైనల్ ధాట్

బోయపాటి మార్క్ అని భవిష్యత్తులో ఫిల్మ్ స్కూల్ పుస్తకాల్లో ఓ పాఠం పెడితే..ఈ సినిమా తప్పకుండా పెట్టేలనిపించే స్దాయిలో ఉంది.

ఏమి బాగుంది: మాస్ సినిమాలకు ఈ మధ్యకాలంలో సినిమాలు సరైనవి పడటం లేదు. ఆ లోటునితీర్చటానికి వచ్చిన సినిమా ఇది.

ఏం బాగోలేదు: ఎనీ ఎమోషన్ సింగిల్ ఎక్సప్రెషన్ అన్నట్లుగా కనిపించిన హీరో , ఓవర్ డోస్ సెంటిమెంట్, పైట్స్

ఎప్పుడు విసుగెత్తింది : హీరోయిన్ కు, హీరో కుటుంబానికి మధ్య వచ్చే ఫ్యామిలీ సీన్స్

చూడచ్చా ?: ఖచ్చితంగా..మీలో మాస్ యాంగిల్ ఉంటే ...అది ఫుల్ గా సాటిస్ ఫై అవుతుంది

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT