Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Rangula Ratnam Movie Review - Raj Tarun, Chitra Shukla

January 14, 2018
Annapurna Studios
Raj Tarun, Chitra Shukla, Sitara, Priyadarshi
LK Vijay
Srikar Prasad
Purushottam M
Sricharan Pakala
Nagarjuna Akkineni
Sri Ranjani

ప్చ్..బాగా స్లో ('ర‌ంగుల‌ రాట్నం' రివ్యూ)

రాజ్ తరణ్ కు కెరీర్ మొదలైంది 'ఉయ్యాల జంపాల' సినిమాతో ...దాంతో ఆ సినిమాని అందించిన బ్యానర్ (అన్నపూర్ణ) లో మళ్లీ సినిమా వస్తోందంటే ఆసక్తే. అలాంటి సినిమా ఎలా ఉండాలి... కేవలం టైటిల్ విషయంలో సారూప్యత చూపెడితే సరిపోతుందా.. అప్పుడు ‘ఉయ్యాలా జంపాలా’ అని టైటిల్ పెట్టాం ..హిట్టైంది కదా అని ..ఈ సారి కూడా అలాంటి టైటిల్ ని వెతికి పెడితే హిట్టైపోతుందా...మిగతా విషయాల్లోకూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా..అది ఈ చిత్రానికి జరిగిందా.. ఈ సినిమానుంచి ఎదురుచూసే....రాజ్ తరణ్ మార్క్ ఫన్ ఈ సినిమాలో ఉందా.. ఈ సినిమాతో పరిచయమవుతున్న మహిళా దర్శకురాలు...విభిన్నమైన పాయింట్ ఏమన్నా తీసుకుని రంగంలోకి దిగిందా..లేక అందరిలా రొట్టకొట్టుడు వ్యవహారమేనా? ...కొనుక్కున్నవారికి ... రంగులరాట్నం బాగా తిరిగి భలే డబ్బులు తెచ్చిపెడుతుంది అనిపించుకుంటుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

'ఎమోషన్స్' అనే గ్రీటింగ్ కార్డ్ ల కంపెనీలో పనిచేసే విష్ణు(రాజ్‌ తరుణ్‌) స్వభావరీత్యా ప్రతీది లైట్ తీసుకునే తత్వం . అతనికి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేసే కీర్తి(చిత్ర శుక్లా) పరిచయం అవుతుంది. ఆమెది విష్ణుకి క్వయిట్ కాంట్రాస్ట్ క్యారక్టర్. ప్రతీ విషయంలోనూ పద్దతిగా (చూసేవారికి అతి జాగ్రత్తగా) ఉండే తత్వం ఆమెది. అయితే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నట్లుగా వీళ్లద్దరి పరిచయం కొన్నాళ్లకు ఆకర్షణగా...ప్రేమగా మారుతుంది. ఈలోగా ఊహించని విధంగా విష్ణు తల్లి (సితార) చనిపోతుంది. దాంతో తన గురించి మొత్తం తెలిసిన కీర్తి ..ని జీవిత భాగస్వామిగా చేసుకుంటే మంచిదనే నిర్ణయానికి వస్తాడు విష్ణు. ఆమె కూడా ఓకే అంటుంది.

కథ సుఖాంతమవుతుంది అనుకుంటే...అక్కడ నుంచే అసలు కాంప్లిక్ట్ మొదలవుతుంది. ప్రతీది లైట్ గా తీసుకునే అతనికి..ఆమె అతి జాగ్రత్తలు, అమితమైన ప్రేమ,ఓవర్ కేరింగ్ ...తట్టుకోలేనివిగా..పెద్ద శిక్షగా మారతాయి. దాంతో విరక్తి,విసుగు కలిగి ...ఆమెతో తెగతెంపులు చేసుకునే స్దాయికి వెళ్లిపోతాయి. అప్పుడు ఏమేంది... అసలు కీర్తికు అతి జాగ్రత్తలు తీసుకునే వ్యక్తిత్వం ఎందుకు అలవాటైపోయింది...తిరిగి విష్ణు, కీర్తి కలిసారా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

యాక్ట్ టు ఏదీ?

రొమాంటికి కామెడీలు సాధారణంగా ..ఒకరంటే మరొకరికి పడని రెండు లీడ్ పాత్రలు ప్రేమలో పడటం...విడిపోవటం..తిరిగి కలవటం అనే ప్రాసెస్ చుట్టూ తిరుగుతూంటాయి. ఈ సినిమాలోనూ అలాంటి క్యారక్టర్స్ నే తీసుకున్నారు. అంతవరకూ ఓకే...కానీ అదొక్కటే కథ కాదు కదా..ఆ పాత్రల మధ్య లోంచి పుట్టే సంఘర్షణకు పెద్ద పీట వెయ్యాలి కదా.. అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు. ఎక్కడో క్లైమాక్స్ ముందు వరకూ ..తామిద్దరం ఒకరికొకరం సరిపడం అనే విషయం లీడ్ క్యారక్టర్స్ అర్దం చేసుకోరు..అప్పుడు విడిపోదాము అనుకుంటారు..దాంతో వాళ్లు విడిపోయిన తర్వాత ఎలా కలిసారు..వాళ్ల స్వభావాల్లో ఎలా మార్పులు వచ్చాయి..ఆ మార్పులు రావటానికి లీడ్ చేసిన సంఘటనలు ఏమిటి...అనే విషయాలు కు టైమ్, స్క్రీన్ స్పేస్ లేకుండా పోయింది.

అంటే స్క్రీన్ ప్లే భాషలో చెప్పాలంటే యాక్ట్ టూ పూర్తిగా మిస్సైంది. యాక్ట్ వన్, యాక్ట్ త్రి ఉంది తప్ప..యాక్ట్ టు కు స్దానం లేకుండా పోయింది. అదే ఈ సినిమాకి ఇబ్బందిగా మారింది. మినిమం ఇంటర్వెల్ కు వచ్చేసరికి అయినా ఇద్దరూ బ్రేక్ అప్ అయ్యి సెకండాఫ్ లో వీళ్ల కలయిక చుట్టూ జరిగే సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. దానికి తోడు ఓవర్ డోస్ తల్లి సెంటిమెంట్. ఏదో తమిళ బ్యాచ్ వచ్చి స్క్రిప్టు రాసి డైరక్ట్ చేసినట్లు అనిపించింది. అంతెందుకు హీరో తల్లి పాత్ర అర్దాంతరంగా చనిపోతుంది. కానీ కథలో అలా పాత్రని చంపేటయటం వల్ల పెద్దగా కథకు ఒరిగిందేమీ లేదు. సెంటిమెంట్ కు ,మెలోడ్రామా కు తప్ప.

సాంకేతికంగానూ..

ఇలాంటి ప్రేమ కధా చిత్రాల్లో విజువల్స్ కు, పాటలకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆ విషయంలోనూ ఈ సినిమా పూర్తిగా వెనకబడిందనే చెప్పాలి. ఇవన్నీ చాలదన్నట్లుగా స్లో పేస్ లో నడిచే సీన్స్ సహనానికి పరీక్షగా మారతాయి..రంగుల రాట్నం ఇంత స్లోగా తిరిగితే ఎవరూ ఎక్కరనే విషయం మరిచిపోయారు. అయితే స్లోగా ఉన్నా కొన్ని స్లో పాయిజన్ లా ఎక్కే సామర్ద్యం ఉన్న స్క్రిప్టులు ఉంటాయి. ఈ సినిమాలో అదీ లేదు. ఇలాంటి కథలకు కీలకంగా నిలవాల్సిన సినిమాటోగ్రఫి కూడా అంతంత మాత్రమే. మిగతా డిపార్టమెంట్ లు ఎంత బాగా చేసినా ఎలివేట్ కాలేకపోయాయి. ఎడిటర్ గారు కాస్త రిపీట్ అయిన సీన్స్ లేపేస్తే ఇంకా బాగుండేది.

సినిమాలో ఎక్కడా ఉత్సాహం, ఊపు కనపడదు. తెరపై కనపడే హీరో,హీరోయిన్స్ విడిపోయినా..కలిసినా..ఏమై పోయినా నాకేంటిలే అనే ఫీలింగ్ వస్తుంది.

ఈ చిత్రంతో పరిచయమైన మహిళా దర్శకురాలు...స్క్రీన్ పై బాగా డీల్ చేసినా స్క్రిప్టు పరంగా బాగా వెనకబడ్డారు. అలాగే హీరోయిన్ లింప్ సింక్ సినిమాలో సరిగ్గా కుదరలేదనే విషయం గుర్తించినట్లు లేరామె. నెక్ట్స్ టైమ్ బెటర్ లక్.

హైలెట్స్

సినిమాలో ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ సీన్స్ మాత్రం కాస్తంత ఫన్ తో నడిపి..కాస్త రిలీఫ్ ఇచ్చారు. సినిమాలో ప్రియదర్శిని కామెడీ బాగుంది.

ఫైనల్ థాట్...

షార్ట్ ఫిలిం ల నుంచి వచ్చి, స్ట్రాంగ్ గా కెరీర్ కు పునాదిలు వేసుకుని ముందుకు వెళ్తున్న రాజ్ తరుణ్ తను పని చేసే బ్యానర్స్ పైనే కాకుండా తను పనిచేయే స్క్రిప్టుల పైన కూడా పూర్తి దృష్టి పెడితే...మరిన్ని కుమారి 21 ఎఫ్ ,ఉయ్యాల జంపాల,సినిమా చూపిస్తామామా, వంటి సినిమాలు వస్తాయి. అవన్నీ కేవలం రాజ్ తరణ్ హీరోయిజం మీద కాకుండా స్క్రిప్టు స్ట్రాంగ్ గా ఉన్నవే అని గమించాలి.