Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Keshava Movie Review

May 19, 2017
Abhishek Pictures
Nikhil, Ritu Varma, Isha Koppikar, Rao Ramesh, Ajay, Brahmaji, Vennela Kishore and Priyadarshi
Raghu Kulakarni
Diwakar Mani
Vivek Kuchibhotla
Sudheer Varma
Devansh Nama
Sunny MR
Abhishek Nama
Sudheer Varma

కే...శవ (నిఖిల్ ” కేశవ ” రివ్యూ)

తన కళ్లదెరుగా...తల్లిని,తండ్రిని చంపారని...పగతో రగిలిపోతూంటాడు హీరో. ఆ పగనే ఆహారంగా తీసుకుని, పెరిగి పెద్దై చట్టానికి దొరకకుండా వరసపెట్టి హత్యలు చేస్తూంటాడు. అతన్ని పట్టుకోవటానికి యాజ్ యూజవల్ గా పోలీసులు ట్రై చేసి, తమ వల్ల కాదని... ప్రత్యేక అధికారిని దింపుతారు. అక్కడ నుంచీ పోలీస్ వెహికల్స్, ఛేజింగ్ ల హడావిడితో ఇన్విస్టిగేషన్. అలా జరిగి జరిగి ఒక టైమ్ లో హీరోగారు అలిసిపోయో..లేక సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తోందనో, పట్టుబడటం జరుగుతుంది. అప్పుడు.. ఆయన్ను ప్రేమించిన హీరోయిన్ లేక మరొక ఫ్రెండో...ఇంత దారుణంగా హత్యలు చేయటానికి బలమైన కారణం ఉందా,లేక మాకు తెలియకుండా డబ్బులు కోసం ఫ్రొఫిషనల్ కిల్లర్ లా మారి మర్డర్స్ చేస్తున్నావా...అని పట్టలేని కుతూహలంతో నిలదీస్తారు.

అప్పుడు హీరోగారు...ఇన్నాళ్లకు కదా నన్ను క్వచ్చిన్ చేసే వాళ్లు కనపడ్డారు అన్న ఆనందంతో... మర్డర్స్ వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ అంతా విప్పి చెప్పటం..ఇదంతా ..ఆ ఇన్విస్టిగేట్ చేస్తున్న పోలీస్ అధికారి కూడా తెలుసుకుని... అయ్యో...నిజమే కదా,మనకు అలాంటి పగ,ప్రతీకారం స్కీమ్ ఉన్నా అలాగే హత్యలు చేద్దుము కదా... అని కన్వీన్స్ అయ్యి,మనుస్సులో కన్నీరు పెట్టుకుని...హీరో గారు...చట్టం రీత్యా హంతుకుడే కానీ...అమాయకుడు ..కాలమే క్రిమినల్ ని చేసేసింది అని తన మనస్సాక్షి సాక్షిగా తీర్పు ఇచ్చేసి వదిలేయటం జరుగుతుంది.

ఇదంతా చదువుతూంటే ఎనభైల్లో వచ్చిన సినిమాలు గుర్తు వస్తున్నాయా..అవును మరి ఈ మధ్యకాలంలో ఎవరూ ఇలాంటి కథలతో సినిమాలు చేసే ధైర్యం చేయటం లేదు. కానీ డైరక్టర్ సుధీర్ వర్మ సాహసం చేసాడు. ఈ మధ్యకాలంలో రాలేదు కాబట్టి ఖచ్చితంగా విభిన్నంగా ఫీలవుతారు అని పీలై చేసినట్లున్న ఈ సినిమా ఎలా ఉంది. ఇదే స్టోరీ లైన్ ని కొత్తగా చెప్పటానికి దర్శకుడు ఏం జాగ్రత్తలు తీసుకున్నాడు. స్వామిరారా మ్యాజిక్ ని నిఖిల్, సుధీర్ వర్మ రిపీట్ చేయగలిగారా...వంటి మీ మనస్సులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే క్రింద ఉన్న రివ్యూ చదవండి.

కథేంటి...

లా స్టూడెంట్ కేశవ శర్మ (నిఖిల్) ఓ ప్రక్క చదువుతూనే మరో ప్రక్క వరస పెట్టి పోలీస్ లను చంపుతూంటాడు. దాంతో పోలీస్ డిపార్టమెంట్ లో కలకలం మొదలవుతుంది. లా చదువుతున్న తెలివితేటలతో క్లూ లు ఏమీ వదలకుండా చాలా తెలివిగా చంపుతున్న కేశవ ఆచూకి దొరకక పోలీస్ డిపార్టమెంట్... ఓ ఇన్విస్టేగేషన్ అధికారి షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్)ని రంగంలోకి దింపుతుంది. అక్కడ నుంచి ఆమె ఇన్విస్టిగేట్ చేసి, ఛేజ్ చేసి మరీ కేశవను పట్టుకుంటుంది. కానీ కేశవ తన తెలివితో తను కాదు హత్యలు చేసింది , అని వాదించి తప్పించుకుని, హత్యలను కంటిన్యూ చేస్తూంటాడు. అప్పుడు ఆ ఇన్విస్టేగేషన్ ఆఫీసర్ ఏం ప్లాన్ వేసి,కేశవను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేసింది. అసలు కేశవ..పోలీస్ లనే ఎందుకు చంపుతన్నాడు..అతని ప్లాష్ బ్యాక్ ఏమిటి...అంతేకాకుండా అతని గుండె జబ్బుకు, ఈ మర్డర్డ్స్ కు ఏమన్నా సంభందం ఉందా...ఈ కథలో హీరోయిన్ రితూ వర్మ పాత్రేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ...

పైన చెప్పుకున్నట్లుగా ఇలాంటి కథలు ఈ మధ్యకాలంలో రావటం లేదు. ఇప్పుడు క్రైమ్ సినిమాలు వచ్చినా అవి వెంకటేష్ తో చేసిన దృశ్యం సినిమా స్దాయిని దాటగలిగి ఉండాలి. అంత ఇంటిలిజెంట్ గా , థ్రిల్లింగ్ గా , ప్రతి క్షణం ఉత్కంఠతో నడవాలి. సుధీర్ వర్మ అవేమీ పట్టించుకున్నట్లు లేరు. అవేమి తన కథలో లేకపోవటమే విభిన్నత అనిభావించినట్లున్నారు. మేకింగ్ లో చూపిన స్టైల్ లో సగం కూడా స్క్రిప్టు లో చూపించలేదు. ఎక్కడా మెరుపులు లేవు, మైమరుపులు లేవు. బదలాపూర్ సినిమాలో లాగ..హీరో లక్ష్యం కేవలం పగ తీర్చుకోవటమే అన్నట్లుగా సీన్స్ డిజైన్ చేసి, వాటిపైనే వర్కవుట్ చేసారు.

Quentin Tarantino సినిమాలో చూపించే విధంగా చాప్టర్స్ గా ఈ కథను చెప్పారు. అంతా బాగానే ఉంది. కానీ అల్లుడునోట్లోనే శని అన్నట్లుగా....కథ,కథనం దగ్గరే కాంప్రమైజ్ అయ్యపోయాడు. ఇంటర్వెల్ దాకా ఎంతో ఇంటెన్స్ తో నడిపిన దర్శకుడు సెకండాఫ్ లో పట్టు వదిలేసాడు. అందుకు కారణం...చేతికి దొరికిన కేశవను పోలీస్ అధికారి వదిలేయటానికి చెప్పే కారణం మరీ సినిమాటెక్ గా ఉండటమే. అతనే మర్డర్స్ చేస్తున్నాడని తెలిసినా, ఆదారాలు సరిగ్గా దొరకలేదని మీడియాకు భయపడి పోలీస్ లు హీరోని వదిలేసారంటే కన్వీన్సింగ్ గా అనిపించదు. అలాగే సినిమా క్లైమాక్స్ లో వచ్చే రావు రమేష్ ట్విస్ట్ అసలు పేలలేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్ వల్ల హీరోకు కానీ కథకు కానీ కలిసి వచ్చిందేమి లేదు..నష్టపోయిందేమీ లేదు.

ఎందుకు పెట్టారో మరి..

ఇక అన్నిటికన్నా దారుణం ఏమిటంటే..ట్రైలర్స్ లో హైలెట్ గా చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన హారోకు హార్ట్ ప్లాబ్లం వ్యవహారంపై సినిమాలో ఒక్క సీన్ కూడా లేదు. హీరోకు గుండె రైట్ సైడ్ ఉన్నా, లెప్ట్ సైడ్ ఉన్నా, అసలు గుండే లేకున్నా కథలో పెద్ద మార్పేమీ ఉండదు. అలాగే ఇలాంటి సినిమాలు చూడటానికి ధియోటర్ కు వచ్చేవారికి....ఏదో విభిన్నమైన స్క్రీన్ ప్లైతో నడిచే కథను ఆశిస్తారు.అలాంటిదేమీ ఈ సినిమాలో కనిపించదు. చివర్లో..మెయిన్ విలన్ ఎవరు అనేది ఎలా హీరో కనిపెట్టాడు అనే విషయం చెప్పటం దర్శకుడు మర్చిపోయాడు.

హైలెట్స్

ఈ సినిమాలో ప్రధాన హైలెట్ ఏమిటంటే...దివాకర్ మణి సినిమాటోగ్రఫి. ఆ తర్వాత దర్శకుడు సుధీర్ వర్మ చాలా ఇన్నోవేటిగా చేసిన షాట్ మేకింగ్. అటు కెమెరామెన్, ఇటు దర్శకుడు కలిసి తెరపై విజువల్ ట్రీట్ అందించారు. కొత్త విజువల్స్ ని తెరపై పరిచారు.అలాగే ఇంటర్వెల్ లో నిఖిల్ ని అరెస్ట్ చేసే సీన్, స్మోక్ లో నిఖిల్ బైక్ తో వచ్చే silhouette షాట్, పోలీస్ జీప్ పై వచ్చే ఏరియల్ షాట్స్, ఇంటర్వెల్ లీడ్ సీన్స్ లో బస్సుని పోలీస్ జీపుతో ఛేజ్ చేయటం వంటి వి అద్బుతంగా తీసారు. నటీనటుల్లో నిఖిల్ కొత్తగా తన రెగ్యులర్ నటనకు భిన్నంగా చేసారు. కథ,కథన విషయంలో తప్ప దర్శకుడు గా సుధీర్ వర్మకు వంద వంద మార్కులు వేయవచ్చు.

సెకండాఫ్ లెంగ్త్ సాగతీయకుండా 45 నిముషాల్లో ముగించటం, కమర్షియల్ యాంగిల్ అంటూ లవ్ సీన్స్ పెట్టాలనే ప్రయత్నం చేయకపోవటం వంటివి మంచి ఆలోచనలు. మారుతున్న సినిమాకు ఇవి నిదర్శనాలు.

సాంకేతికంగా..

వెన్నెల కిషోర్ తో చేసిన కామెడీ సీన్స్ అంత గొప్పగానూ లేవు, అలాగని తీసి పారేసాలాగ లేవు. ప్రియదర్శి కామెడీ కూడా ఏమీ పేలలేదు. అయితే కొంచెం అడల్ట్ గా ఉన్నా వెన్నెల కిషోర్ తో చేసిన హెల్మెట్ జోక్ అదిరింది. సంగీతం సోసోగా ఉంది. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైలాగులు సింపుల్ గా ఉన్నాయి.

ఫైనల్ గా...

క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసే వారికి ఇది అద్బుతం అనిపించకపోయినా ఇది ఓకే అనిపిస్తుంది. ట్రైలర్ చూసి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుని వెళితే మాత్రం నిరాశపడతారు. మల్టిప్లెక్స్ లను టార్గెట్ చేసినట్లున్న ఈ సినిమా బి,సి సెంటర్లకు ఎంతవరకూ పడుతుందనేది అనుమానమే.