Movies | Music | Music

ADVERTISEMENT

God, Sex and Truth Review

January 26, 2018
NA
Mia Malkova
NA
M M Kreem
Strikeforcegst
Ram Gopal Varma

ఆలోచనల్లో నగ్నత్వం ('గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' రివ్యూ)

సాధారణంగా సెలబ్రెటీ స్దాయికి వెళ్లిన ఓ సినిమా డైరక్టర్ ఎవరైనా ఫోర్న్ అనే పదం పలకటానికే సిగ్గుపడతాడు..అలాంటిది ..వర్మ భలే ధైర్యం...ఏకంగా మనం ఫోర్న్ ఫిలింలలో చూసే ఆమెను తీసుకువచ్చి సినిమా తీసాడట కదా... ఎంతైనా ఇలాంటి ఐడియాలు వర్మకే వస్తాయి..గ్రేట్...ఎలాగైనా చూసేయ్యాలి..ఇది ఓ వర్గం ఎదురుచూపు అయితే...వర్మ ఇంత దిగజారిపోయాడేంటి...మరీ భారతీయ సంసృతి,సంప్రదాయాలను రోడ్డుపై పెట్టేస్తున్నాడు...పోయి పోయి ఫోర్న్ సినిమా తియ్యటమేంటి..ఇన్నాళ్లు ఫోర్న్ ..గుట్టుగా చూసే జనం...వర్మ పుణ్యమా అని సెల్ ఫోన్ లో బహిరంగంగా చూసేస్తారు..మొత్తం నాశనం చేసేసాడు..గుట్టుగా ఉంచాల్సినవి కూడా గూబ గుయ్యమనేలా కొట్టి మరీ చెప్తున్నాడు..దానికి రకరకాల పేర్లు పెడుతన్నారు..ఇదీ మరో వర్గం ఆవేదన.

ఇలా ఇంతమందిలో ఆలోచనలు రేపి..తన ప్రొక్టుపై ఆసక్తి రేపటం ఆయనకు కొత్తేం కాదు...కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకోవటం కన్నా టీవి ఛానెల్స్ లైవ్, ట్వీట్టర్ లో ట్వీట్స్ ఆ పని చేస్తాయని ఆయనకు తెలుసు. హిట్టా..ఫట్టా అనేది ప్రక్కన పెడితే..అసలు తను ఫలానా ప్రాజెక్టు చేసాను అని జనాలకు తెలియచేయటంలోనే ఆయన చూపే తెలివి అమోఘం..దాన్ని చీప్ పబ్లిసిటీ అని కొట్టిపారేసినా అది అందరికీ సాధ్యం కాదు. అదంతా ప్రక్కన పెడితే తాజాగా ఆయన ఓ ఫోర్న్ ఫిలిం లాంటి ఓ వీడియో విడుదల చేసారు. జీఎస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) టైటిల్ తో వచ్చిన ఈ వీడియో ఆయనలోని పరిణితిని చూపించిందా...లేక ఏదో విధంగా జనాలని ఎట్రాక్ట్ చేయాలనే మరో నిరర్దక ఆలోచనగా మిగిలిపోయిందా...అసలు ట్రూత్ ఏంటి అనేది చూద్దాం.

ఎలా ఉంది..ఏముంది

ఇదేమీ సినిమా కాదు... పంతొమ్మిది నిమిషాల 20 సెకండ్ల డ్యూరేషన్ తో సాగే ఓ వీడియో. ఓ డాక్యుమెంటరీ నేరేషన్ లో... ఒక స్త్రీ తనకు శృంగారం పట్ల ఉన్న ఆలోచనలు వెల్లడిస్తూ సాగుతుంది. ఆ ఆలోచనలు ఎలాంటివంటే... శృంగారం అనేది ఆకలి ఎంత సహజమో అంత సహజమని చెప్తుంది. మ నకు నచ్చింది తింటున్నట్లే తనకు కావాల్సింది కావాల్సినట్లుగా శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటుంది. శృంగారం అనేది అనేది భగవంతుడు సహజంగా ఇచ్చిన కోరిక అని దాన్ని మతాల పేరిట ,మోరాలటీ పేరిట సమాజం అణిచివేయటం మాత్రం చాలా దారుణం,అరాచకం అంటూ గోలెడుతుంది. తను ఇలా పంచుకునే నగ్నమైన ఆలోచనలు అసహజం ఏమీ కాదని , సపోర్ట్ కోసం అన్నట్లుగా ఇలాంటి విషయాలని గతంలో చెప్పిన గొప్ప తత్వవేత్తలను కోట్ చేస్తూ ఈ వీడియో సాగుతుంది.

అదేమీ లేదు

ఇక ఈ వీడియోలో శృంగారం గురించి ఉంది తప్ప శృంగారం అనేది ఎక్కడా లేదు. ఫోర్న్ సినిమా అసలే కాదు. ఏదో ఎక్సపెక్ట్ చేస్తే ఖచ్చితంగా నిరాశే ఎదురు అవుతుంది. అలాగే నగ్నంగా మియా ను చూపిస్తున్నా వల్గర్ గా అనిపించదు. ఒకమ్మాయి శృంగారపరమైన తనలో ఉన్న ఆలోచనలను మనతో షేర్ చేసుకుంటన్నట్లే ఉంటుంది.

ముఖ్యంగా మియా మాల్కోవా శరీరాన్ని చూపెడుతూ..రకరకాల కోణాల్లో దాన్ని ఆవిష్కరిస్తూ ఈ వీడీయో సా...గు...తుంది. ఆమె శరీరంలోని ఎత్తుపల్లాల్ని, ఒంపుసొంపుల్ని ఇది ఆవిష్కరిస్తుంది. అయితే ఇప్పటికే ఆమె వీడియోలు చాలా చూసిన వాళ్లుకు ఇది కిక్ ఇవ్వకపోవచ్చు. అలాగే మియా మాల్కోవాకు ఇది ఒక డెమో ఫిలిమ్ లాంటిది..అయితే ఆమెకు డెమో ఫిలింలు అవసరం ఎప్పుడో దాటేసింది.

ఫైనల్ గా మియా తన శరీరం లో వున్న ప్రతి భాగాన్ని రక రకాల యోగా తరహా భంగిమల్లో చూపించటం జరిగింది.. తన శరీరం లో ని ప్రతి భాగం కొన్ని నిర్ధిష్ట అవసరాల కోసం వుందని తన శృంగార అవయవయాలని గర్వంగా చూపిస్తుంది.

కానీ ఓ విషయంలో నిరాస అనిపిస్తుంది. వర్మ తను చెప్పాలనుకునే విషయం కంటే ఆమెను నగ్నంగా చూపించడంపైనే వర్మ ఎక్కువగా కాన్సర్టేట్ చెయ్యటం విసుగనిపిస్తుంది. కొన్ని సార్లు వాయిస్ ని విజువలే డామినేట్ చేస్తే,చాలా సార్లు బోర్ కొట్టించి,ఫాస్ట్ ఫార్వర్డ్ చేయిస్తుంది.

దీన్నొక ఫిలాసఫికల్ ట్రీటైజ్ (తాత్విక శృంగార గ్రంధం)గా అభివర్ణించాడు వర్మ . అందులో ఆయన కొత్తగా ఆవిష్కరించిన తాత్వికత ఏమిటో ఆయనకే తెలియాలి. ఇక ఈ వీడియోకు హైలెట్స్ ..కీరవాణి సంగీతం, మియా ఒంపుసొంపులు ఆవిష్కరించిన తీరు. కెమెరా వర్క్. అలాగే చలం పుస్తకాలు చదివిన వారికి అవన్నీ గుర్తుకు వస్తాయి.

ఫైనల్ థాట్

ఛానెల్స్ చూస్తూ, మీడియాలో కథనాలు చదువుతూ..వర్మ మాట్లాడే మాటలు వింటూ,ట్వీట్స్ చదువుతూ, పోస్టర్స్ చూసి ఏదో ఊహించుకుని ఈ వీడియో చూస్తే అంత సీన్ లేదనిపిస్తుంది .మోసపోయిన ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా శృంగారంపై ఓ డాక్యుమెంటిరీ చూస్తున్నాం అని ఫిక్సై చూస్తే ...అందులో వర్మ ఏదో చెప్పబోతున్నారని ..మన బుర్రకు అర్దమవుతుంది. ఫైనల్ గా వీడియో చూస్తూంటే...బయాలజీ క్లాస్ కు హాజరయ్యినట్లుగా..అక్కడ స్త్రీ తన అవయవయాలు గురించి స్వయంగా చూపుతూ..చెప్తున్నట్లు ఉందనిపించందంటే అది మీ తప్పు కాదు..తీసిన విధానం అలాంటిది.

 Other Links:   Movie Info   Preview  
ADVERTISEMENT