Movies | Music | Music

ADVERTISEMENT

Tholi Prema Movie Review - Varun Tej, Raashi Khanna

February 10, 2018
Sri Venkateswara Cine Chitra
Varun Tej, Raashi Khanna, Sapna Pabbi
Cinematographer: George C Williams
Editor: Kotagiri Venkateswara Rao
SS Thaman
BVSN Prasad
Venky Atluri

వెన్ ఆది మెట్స్ వర్ష.... (‘తొలిప్రేమ’ రివ్యూ)

‘తొలిప్రేమ’ ... దాదాపు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ మరుపురాని ఓ మేజర్ ఈవెంట్ . ఆ తర్వాత జీవితంలో ఎన్ని గొప్ప విశేషాలు చోటు చేసుకున్నా దాని సాటి రాదు. అందుకే ఫస్ట్ లవ్ ని మర్చిపోవటం కష్టమే. అసలు ఆ పదం వినగానే చాలా మంది అలవోకగా జ్ఞాపకాల్లోకి కొద్ది క్షణాల్లోకి వెళ్లిపోతారు. అంత గొప్ప మ్యాజిక్ ఉంది ఆ పదంలో...ఆ సిట్యువేషన్ లో ... అయితే మన సినిమాలు ఎప్పుడూ అలాంటి హృదయాన్ని తరిచి చూసే లవ్ స్టోరీలు జోలికి పోవు. కానీ 1998లో వచ్చిన ‘తొలిప్రేమ’ మాత్రం ఆ మ్యాజిక్ ని తెరపై పరిచింది. అందరి మనస్సులకు పట్టేసింది. ఇదిగో ఇన్నాళ్ళ తర్వాత మళ్లీ అదే టైటిల్ తో ఓ చిత్రం వచ్చింది. టైటిల్ ఎనౌన్స్ చేయగానే ... అంత పెద్ద హిట్ సినిమా టైటిల్ మళ్లీ అవసరమా అని చాలా మంది అభిప్రాయ పడ్డారు... అయితే ఫిదా హిట్ తో ఖుషీ మీద ఉన్న వరుణ్ తేజ ...మాత్రం టైటిల్ కు తగ్గ న్యాయం సినిమా చేస్తాననే ధైర్యంతో ముందుకు వెళ్లిపోయాడు. మరి నిజంగానే టైటిల్ తగ్గ న్యాయం చేసాడా...ఈ తొలి ప్రేమకు ..పాత తొలి ప్రేమకు ఏమన్నా సంభంధం ఉందా..పోలికలు ఉన్నాయా...ఈ కొత్త తొలిప్రేమ కథేంటి...వరణ్ తేజకు హిట్ ని కంటిన్యూ చేసే అవకాసం ఇచ్చిందా ఈ సినిమా ..కొత్త దర్శకుడు ఈ సున్నితమైన భావోద్వేగాలు గల పాయింట్ ని ఎలా డీల్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

తొలి ప్రేమ..తగువు..మళ్లీ ప్రేమ (స్టోరీ లైన్ )

ఇదో ప్రేమ ప్రయాణం. టీనేజర్స్ ..ఆదిత్య(వరుణ్ తేజ్) వర్ష(రాశిఖన్నా) ఓ ట్రైన్ జర్నీలో కలుస్తారు. తొలిచూపులోనే ప్రేమలో పడతారు. కానీ తెల్లారేసరికి ట్రైన్ జర్నీ పూర్తవటంతో ఎడ్రస్ లు, ఫోన్ నెంబర్స్ కూడా తీసుకోకుండానే విడిపోతారు. ఆ తరువాత మళ్లీ వీళ్లద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో కలుస్తారు. ఈ సారి కాస్త ఎక్కువ సమయం ఉండటంతో ... వారి ప్రేమను కొనసాగిస్తారు. ఒకరికొకరు వ్యక్తం చేసుకుంటారు. కానీ అనుకోని విధంగా ... వారి మధ్య చిన్న చిన్న తగువులు,ఇగో క్లాష్ రావటంతో విడిపోతారు. ఈ సారి పట్టుదలతో ఒకరి ఎడ్రస్ ..మరొకరు తీసుకోరు..పట్టించుకోరు.

కాలగమనంలో ఆరేళ్లు గడుస్తాయి. ఈ సారి లొకేషన్ లండన్ కు షిప్ట్ అవుతుంది. అక్కడ వర్ష, ఆది ఇద్దరూ ఒకే కనస్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగులుగా కలుస్తారు . మళ్లీ తమ కోపతాపాలు మర్చిపోయి... మళ్లీ ప్రేమలో పడతారు... అయితే ఈ సారైనా ఈ ప్రేమ జంట బ్రేకప్ అవకుండా పెళ్లిదాకా వెళ్తారా.. లేక మళ్లీ ఏదో ఒక కారణంతో విడిపోతారా.. అసలు వీళ్లీద్దరు మధ్య నిజంగానే ప్రేమ ఉందా... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

వెన్ ఆది మెట్స్ వర్ష

అప్పట్లో ప్రపంచాన్ని ఊపేసిన రొమాంటిక్ కామెడీ When Harry Met Sally... (1989). ఈ సినిమాలో జీవితంలో వివిధ దశల్లో ఓ జంట కలుస్తూ..విడిపోతూ..కలుస్తూంటారు. ఈ (‘తొలిప్రేమ’ చూస్తూంటే ఆ సినిమా గుర్తుకు వస్తుంది. అలాగని ఇదేదో ఆ చిత్రానికి నకలు,కాపీ అనటం లేదు. అయితే సోల్ అక్కడ నుంచితీసుకున్నారేమో అనిపించింది. సోల్ ఎక్కడ నుంచితీసుకన్నా..సోల్ మేట్ కోసం హృదయం సాగించే అన్వేషణగా తయారైన ఈ చిత్రం ఈ జనరేషన్ యూత్ ఆలోచనలకు అద్దం పడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ..మరీ ఈ కాలం అమ్మాయిలకు జెరాక్స్ కాపీలా ఉంది. కాబట్టి యూత్ కనకెట్ కావటం ఖాయం అనిపిస్తుంది.

మెచ్చుకోవాలి

దర్శకుడు, కథకుడు అయిన వెంకీ అట్లూరి తొలి చిత్రానికి ఇలాంటి కథ ని ఎంచుకోవటం ధైర్యమే. ఎందుకంటే ఏ మాత్రం దారి తప్పినా బోర్ కొట్టేస్తుంది. సింపుల్ స్టోరీ లైన్ ని తన దైన స్క్రీన్ ప్లే, డైలాగులతో స్మూత్ గా లాక్కెళ్లిపోయాడు. ముఖ్యంగా డైలాగులుకు చాలా చోట్ల క్లాప్స్ పడ్డాయి.

ఫస్టాఫ్ లో అలా ..సెకండాఫ్ లో ఇలా

సినిమా ప్రారంభం డల్ గా మొదలైనా మెల్లిమెల్లిగా ఊపందుకుని ఇంటర్వెల్ కు వచ్చేసరికి మంచి సినిమా చూస్తున్న ఫీల్ ఇచ్చింది. అలాగే సెకండాఫ్ కూడా అదే పరిస్దితి..కానీ క్లైమాక్స్ ఇంకొంచెం బలంగా ఉండే బాగుండేది. ఇక ఫస్టాఫ్ ని ఫన్ తో క్యారక్టరైజేషన్స్ ఎలివేషన్ తో కీసీన్స్ తో నడిపేసాడు. సెకండాఫ్ కు వచ్చేసరికి...ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే హైపర్ ఆది ని సెకండాఫ్ లో తీసుకువచ్చి కామెడీతో రిలీఫ్ ఇచ్చాడు. అయితే ఫస్టాఫ్ ఉన్నంత గొప్పగా సెకండాఫ్ మాత్రం ఉండదు. అలాగే పెద్దగా ట్విస్ట్ లు టర్న్ లు పెట్టుకోలేదు. ఓ రొమాంటిక్ కామెడీని అదే స్దాయిలో నీట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు.

పవన్ సినిమాతో పోలిక

ఇక 1998...అప్పటి తెలుగు కుర్రాళ్ల జీవితాల్లో మరుపు రాని సంవత్సరం. ఆ సంవత్సరమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘తొలిప్రేమ’ రిలీజైంది. తాము ఆరాధించే అభిమాన హీరోలను సైతం ప్రక్కన పెట్టి ఈ సినిమాను నాలుగైదు సార్లు చూసేసారు అప్పటి యంగస్టర్స్. అందుకే ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. అలాంటి సినిమా టైటిల్ ని టచ్ చేయటం సాహసమే. కానీ వరుణ్ తేజ చేసాడు. ఏదన్నా తేడా కొడితే ఎన్ని విమర్శలు వస్తాయో తెలుసు. అయినా ధైర్యం చేసాడు. ధైర్యే సాహసే..హిట్ అని రుజువు చేసినట్లైంది. అయితే కేవలం టైటిల్ లోనే తప్ప పవన్ తొలిప్రేమకు ఈ సినిమాకు ఒక్క సీన్ లో కూడా పోలిక లేదు.

కొత్త దర్శకుడు ఎలా చేసాడు

వెంకీ అట్లూరి దర్శకుడుగా వంద కు వంద శాతం మార్కులు వేయించుకన్నట్లే. అలాగే డైరక్టర్ గా కన్నా డైలాగు రైటర్ గా మరింత బాగా రాణించాడు. చాలా చోట్ల స‌న్నివేశాల్ని కేవ‌లం సంభాష‌ణ‌ల‌తో నిల‌బెట్టాడు. ముఖ్యంగా రాఖీ సీన్స్, అలానే కార్‌లో రొమాంటిక్ సన్నివేశాలు డైరక్టర్ లోని విషయాన్ని చెప్తాయి.

మిగతా విభాగాలు

ఇక పాటలు విషయానికి వస్తే.. ఈ మెలోడీలు ఇచ్చింది త‌మ‌న్ అని డౌట్ వస్తుంది. వర్షంలో వచ్చే 'నిన్నిలా' అనే పాత చాలా ప్లెజంట్‌గా అనిపిస్తుంది. కొరియోగ్రఫీ వర్క్ బాగా కుదిరింది. నేపధ్య సంగీతం చక్కగా కుదిరింది. నేప‌థ్య సంగీత‌మూ అంతే. సినిమాటోగ్రఫీ మరో హైలైట్. లవ్ స్టోరీకి తగినట్లు ప్ర‌తీఫ్రేమూ అందంగానే కెమెరామెన్ చూపించారు. ఎడిటింగ్ వర్క్ ఓకే అనిపిస్తుంది. వర్ష పాత్రలో రాశిఖన్నా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. వరుణ్ తేజ కూడా బాగా చేసారు.

ఫైనల్ థాట్

చూస్తూంటే వరుణ్ తేజ మెగా మార్గం వదిలి తనకంటూ ఓ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు అర్దమవుతోంది. ఇదే మంచిది కూడా.

సినిమా చూడచ్చా

లవ్ స్టోరీ కదా కేవలం యూత్ కు మాత్రమే చూడదగ్గ సినిమా అని కాకుండా.. ఫ్యామిలీలకు వీకెండ్ లో చూడటానికి మంచి ఆప్షన్.

 Other Links:   Movie Info   Galleries   Functions   Preview  
ADVERTISEMENT